Skip to main content

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే




మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా స్పీకర్ పదవి కోరే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన ఆ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ ముంబయికి చేరుకున్నారు. శివసేనతోనూ ఆ పార్టీ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ముంబయిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం వద్ద ఆయనతో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రులుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థొరాట్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.