Skip to main content

అమెరికాలో తెలుగు టెకీ మృతి

 
అమెరికాలో తెలుగు టెకీ మృతి
 ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు అమెరికాలో అకాల మరణం చెందారు. గ్రీన్‌ కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ లిస్ట్‌లో ఉన్న అతడి మృతితో గర్భిణి అయిన ఆయన భార్య అర్ధంతరంగా స్వదేశానికి తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతి రాజు మంగళవారం మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏ కారణంతో చనిపోయారన్న వివరాలు తెలియరాలేదు. ఆయన ఫేస్‌బుక్‌ వివరాలను బట్టి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ జాబితాలో ఉంది. రాజు అకాల మరణంతో ఆయన భార్య గర్భిణి అయిన సౌజన్య తిరుగు ప్రయాణం అయ్యారు. 
రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజు కొన్నేళ్లుగా నార్త్‌ కరోలినాలో ఉంటున్నారు. పలు కంపెనీల్లో పనిచేశారు. ఆయన మృతిపట్ల అమెరికాలో తెలుగు సంఘాలు స్పందించాయి. రాజు మృతదేహాన్ని స్వదేశం తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (పాటా) ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. మరోవైపు ఏళ్లుగా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న అక్కడి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here