మహారాష్ట్రలో అధికార ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయన్నారు. ఈ రోజు ముంబైలోని నెహ్రూ సెంటర్లో శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే, అదిత్య థాకరేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్ లు సమావేశమయ్యారు.
ఈ భేటీలో సీఎంగా ఉద్దవ్ థాకరే పేరుపై ఏకాభిప్రాయం కుదిరిందని శరద్ పవార్ ప్రకటించారు. ఈ మూడు పార్టీల నేతలు రేపు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ సన్నద్ధతను తెలుపనున్నట్లు శరద్ పవార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందించనున్నట్లు సమాచారం. రేపు మూడు పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఏర్పాటుపై ఉమ్మడిగా ప్రకటన చేస్తారని పవార్ పేర్కొన్నారు.

Comments
Post a Comment