జనసేన పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
జనసేన పార్టీకి రాజీనామా చేశారు. బాలరాజు ఎన్నికలకు కొద్దిరోజుల ముందే
జనసేనలో చేరారు. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన
ఓటమిపాలయ్యారు. తన రాజీనామాకు దారితీసిన కారణాలను జనసేన అధినేత పవన్
కల్యాణ్ కు ఓ లేఖ రూపంలో తెలియజేశారు. కొన్ని నిర్ణయాలు ఎంతో వేదన
కలిగించినా, రాజీనామా చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు.
రేపు విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న తరుణంలో అదే ప్రాంతానికి
చెందిన ఓ కీలక నేత రాజీనామా చేయడం పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి.
Comments
Post a Comment