Skip to main content

చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డ లక్ష్మీ పార్వతి

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ విభజనకు తీర్మానం చేశారని చంద్రబాబును ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయండని కోరుతూ కేంద్రానికి లేఖను పంపించారని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు తెచ్చుకోలేదని ఆమె ప్రశ్నించారు.

అదేవిధంగా తెలుగు అకాడమీని ఇక్కడకు ఎందుకు తీసుకురాలేదన్నారు. తెలుగు భాషకు సంబంధించి మీరు చేసిందేమిటి? ఎటువంటి పోస్టులు సృష్టించారు? అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఈ దిశలో అడుగులు వేస్తోందన్నారు. తెలుగు అకాడమీని విభజించుకునే ప్రక్రియలో భాగంగా తనను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా వేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములను స్మరించుకునే దినాన్ని కూడా మీరు తుంగలో తొక్కారని టీడీపీ అధినేతను విమర్శించారు. మీకు తెలుగు భాష గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

Comments