Skip to main content

పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో చంద్రబాబుతో బీజేపీ వేదికను పంచుకోదు: విష్ణువర్ధన్ రెడ్డి

 


ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడేందుకు ఈ నెల 3న జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్ లో విపక్షాలన్నీ పాల్గొనాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. మరోవైపు, ఈ మార్చ్ లో తాము పాల్గొనబోమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

విశాఖలో జరిగే పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి బీజేపీ వేదికను పంచుకోదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో ఇసుకను, ఇతర వనరులను ఆ పార్టీ నేతలు దోచేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆందోళనలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీని జనసేన దూరం పెడితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు.

చంద్రబాబును రాష్ట్రంలో ఏ పార్టీ నమ్మడం లేదని... అందుకే పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విష్ణు మండిపడ్డారు. బీజేపీని చంద్రబాబు ఒకటి, రెండు సార్లు మోసం చేయొచ్చు కాన్నీ ప్రతిసారీ మోసం చేయలేరని అన్నారు. జనసేన ఆందోళన వెనుక చంద్రబాబు అనైతిక రాజకీయ ముసుగు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇసుక సమస్యపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అందుకే ఇసుక సమస్యకు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందే తప్ప, నాయకుల పక్షాన కాదని తెలిపారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...