రాష్ట్రంలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించ తలపెట్టిన 'లాంగ్ మార్చ్' కార్యక్రమంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ నిర్వహిస్తోంది 'లాంగ్ మార్చ్' కాదని 'రాంగ్ మార్చ్' అని సెటైర్ వేశారు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే జనసేన ఆందోళనకు దిగడం ఏంటన్న అనిల్ కుమార్, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ పార్టీగా నడుస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని విమర్శించారు. ఏర్పేడు ఘటన బాధితులను పవన్ ఎందుకు పరామర్శించలేదో చెప్పాలని ప్రశ్నించారు.
విశాఖలో రేపు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో భారీగా భవన నిర్మాణ రంగ కార్మికులతో జనసేన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ 'లాంగ్ మార్చ్' కు తాజాగా ఏపీ పోలీసుల నుంచి అనుమతి కూడా మంజూరైంది.
Comments
Post a Comment