Skip to main content

శివసేన నేతే మహారాష్ట్ర సీఎం: సంజయ్ రౌత్

 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీ మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేనకు చెందిన నేతే మహారాష్ట్రకు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. తన పట్టు వీడడం లేదన్న విషయం తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది.

ఈ రోజు సంయజ్ రౌత్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు.  మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్ ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.