Skip to main content

ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. చర్చలు జరిపితేనే అంత్యక్రియలు చేస్తామన్న కుటుంబ సభ్యులు

ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబ సభ్యులు భీష్మించుకున్నారు. దీంతో కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు రెండు రోజుల క్రితం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరికి హాజరైన డ్రైవర్ బాబు గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.

మరోవైపు, కరీంనగర్ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ రెండో రోజు కూడా పిలుపునివ్వగా, విద్యా, వ్యాపార సంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. జిల్లాలోని ఆరేపల్లిలో జరిగిన నిరసనల్లో ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. డ్రైవర్ బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...