Skip to main content

ఏపీ రాజధానిపై డిసెంబరు 9లోగా స్పష్టత ఇవ్వాలి... లేకపోతే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేస్తాం: రాజధాని రైతులు




ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు తుళ్లూరు మండలం మందడంలో సమావేశమయ్యారు. రాజధానిపై డిసెంబరు 9 లోగా స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన ప్రకటన చేయకుంటే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో ఆందోళనకు గురయ్యామని తెలిపారు. రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

కాగా, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్య అంశం కాదని, లక్షల కోట్లు వెచ్చించి, లండన్ తరహా రాజధాని నిర్మించడం తమ ప్రభుత్వ స్తోమతకు తగని పని అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి ఈ విధమైన పరోక్ష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే రాజధాని ప్రాంత రైతులు సమావేశం నిర్వహించారు.

Comments