రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్ వద్ద సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో 5, 6 తేదీల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అలాగే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది.
మరోవైపు, అరేబియా సముద్రంలో రెండు తుపాన్లు కొనసాగుతుండగా, సూపర్ సైక్లోన్‌గా మారిన ‘క్యార్’ బలహీనపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తుపానుగా కొనసాగుతోంది. నేడు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుపాను నిన్న సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలహీనపడి, రాత్రికి లక్షదీవుల వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment