ఇస్రో చైర్మన్ శివన్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-47 నమూనాకు పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని, రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం ఉంటుందని అన్నారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగానికి ఈ రోజు ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటలపాటు ఇది కొనసాగనుంది.
రేపు ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-47ను నింగిలోకి పంపుతారు. 714 కిలోల బరువు ఉన్న కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలను రోదసిలోకి పంపుతారు.
Comments
Post a Comment