ఏపీలో మీడియాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 2430 అమలుకు
నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు
మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని
ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. తాజాగా, జీవో 2430 వివాదాన్ని ప్రెస్
కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలంటూ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ
చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ
జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని
అభిప్రాయపడింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment