దుబాయ్‌లో ఈ రోజు బీజేపీ నేత సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకకు పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు దుబాయ్ వెళ్లనున్నారు. వారి ప్రయాణం నిమిత్తం 15 విమానాలు ఏర్పాటు చేశారు. నిశ్చితార్థానికి పలువురు వైసీపీ ఎంపీలకు కూడా ఆహ్వానాలు అందాయి.
దుబాయ్‌లో ఈ వేడుక అంగరంగ వైభంగా జరుగుతుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆలూరి రాజా కుమార్తె పూజతో సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ కు నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిసింది. ఆలూరి రాజా కుటుంబ సభ్యులు అందరూ వైద్యులే. అమెరికాలో వీరి కుటుంబం ఉంటోంది.
Comments
Post a Comment