Skip to main content

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి:అనిల్‌

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి:అనిల్‌
 ఇదివరకు ప్రకటించినట్లే పోలవరం పనులను నవంబర్ 1న ప్రారంభించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరంపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. 2021 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేస్తామన్నారు. వరద జలాలతో రాయలసీమలో 86 శాతం ప్రాజెక్టులు నిండాయని తెలిపారు. తెదేపా హయాంలో పెండింగ్ పనులు పూర్తి చేయక పోవడం వల్లే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నింపలేకపోయామని మంత్రి ఆరోపించారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఉన్న అన్ని ప్రతిపాదనలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Comments