Skip to main content

ఇంకా పరారీలోనే కూన రవికుమార్... ఆయనింటికి వెళ్లి అల్పాహారం చేసిన చంద్రబాబు!



తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ పునర్మిర్మాణ పనుల్లో బిజీగా ఉంటూ, నేడు శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆయన పార్టీ నేత కూన రవికుమార్ ఇంటికి అల్పాహారం నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో రవికుమార్ లేకపోవడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వ అధికారులపై మాటజారిన కేసులో కూన రవికుమార్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ, కోర్టు ఇంకా మంజూరు చేయలేదు. దీంతో ఆయన దాదాపు నెల రోజులుగా ఇంటికి దూరంగా ఉండగా, పోలీసులు పరారీలో ఉన్నారని ప్రకటించి, ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here