Skip to main content

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత

BJP Spokesperson Laxmipathy Raja Thanked AP CM - Sakshi

ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలుపుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అర్చకుల కుటుంబాల్లో వెలుగు నింపినట్లుయిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని నిర్ణయించడం సంతోషదాయకమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.   

Comments