Skip to main content

దేనికైనా తెగిస్తా: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్






 


'మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, దేనికైనా తెగిస్తా' అని తెలుగుదేశం నేత, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పలు వివాదాల్లో చిక్కుకున్న చింతమనేని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆపై పలు కేసుల్లో పోలీసులు అయన్ను అరెస్డ్ చేశారు కూడా. తనను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని చింతమనేని ఆరోపిస్తున్నారు. తాజాగా అరెస్టుల వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

Comments