‘ఈ రెండు రోజుల్లో మోదీ, జిన్‌పింగ్ మొత్తం ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ అయ్యారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. భారత్, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చైనా తరఫున వైస్ ప్రీమియర్ హు చుంగ్‌హువా పాల్గొంటారు’ అని విజయ్ గోఖలే వెల్లడించారు.
భేటీలో భాగంగా మోదీ, జిన్‌పింగ్ మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనే రాలేదని గోఖలే తెలిపారు. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత విషయమని గోఖలే మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సవాళ్ల గురించి ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని జిన్‌పింగ్ చైనాకు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారని, త్వరలోనే అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు.
నేపాల్ బయల్దేరిన జిన్‌పింగ్
భేటీ అనంతరం జిన్‌పింగ్‌కు మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుతో భారత పర్యటన ముగించుకున్న జిన్‌పింగ్.. చెన్నై నుంచి నేపాల్ బయల్దేరారు. ఆయనకు మోదీ దగ్గరుండి వీడ్కోలు పలికారు. దాదాపు 23ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు నేపాల్‌లో పర్యటించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం.
Comments
Post a Comment