ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్ జైల్లో రిమాండ్
ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.
అనారోగ్యం పాలైన చిదంబరంను వెంటనే జైలు వర్గాలు ఎయిమ్స్ ఆసుపత్రికి
తరలించాయి. చిదంబరంను ఎయిమ్స్ వైద్యులు వీఐపీ ప్రైవేటు రూమ్ లో ఉంచి
వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న చిదంబరంను ఇటీవలే ఈడీ
కూడా కస్టడీలోకి తీసుకుంది.
Comments
Post a Comment