Skip to main content

విధానాలు వ్యతిరేకించకూడదు : నిర్మలాసీతారామన్‌

 



వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో లోపాలున్న మాట వాస్తవమేనని, అంతమాత్రాన విధానమే తప్పని విమర్శించడం, దూషించడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక నిపుణులు తగిన సలహాలు ఇస్తే లోపాలు సరిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరిశ్రమ వర్గాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పుణెలో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. జీఎస్‌టీ వసూళ్లలో క్షీణత ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా వసూళ్లు తగ్గాయని వివరించారు. ఇందుకు గల కారణాలను అన్వేషించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కొంతమంది జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన నిర్మల పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో ఆమోదం పొందిన జీఎస్‌టీ విధానాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఇబ్బందులు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించకుండా మెరుగైన విధాన రూపక్పనకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొందరు ఆర్థిక నిపుణులు ఇచ్చిన సలహాలను స్వీకరించారు

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...