Skip to main content

బోరు బావిలో చిన్నారి చిక్కుకుపోవడం పట్ల ప్రధాని ఆవేదన

 

ఇటీవల కాలంలో బోరు గుంతలు పిల్లల ప్రాణాలు బలిగొంటున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోవడం దేశవ్యాప్తంగా ఆవేదన కలిగిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ చిన్నారి ఎలాంటి ఆపద వాటిల్లకుండా క్షేమంగా బయటపడాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. చిన్నారిని బయటికి తీసుకువచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంపై తమిళనాడు సీఎం పళనిస్వామితో కూడా చర్చించానని మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మూడు రోజుల క్రితం ఆ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. అప్పటినుంచి సుజిత్ ను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Comments