Skip to main content

మోదీతో సమావేశమైన నోబెల్ విజేత అభిజిత్‌ బెనర్జీ

 
 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థిక వేత్త, నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ భేటీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ తమ భేటీకి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఆయనతో భేటీ అద్భుతంగా జరింగదని, మనుషులంతా సాధికారత సాధించాలన్న ఆయన ప్యాషన్ స్పష్టంగా తెలుస్తోందని ట్వీట్ చేశారు. పలు అంశాలపై తాము విస్తృతంగా చర్చించామని అన్నారు. ఆయన సాధించిన విజయం పట్ల భారత్ గర్విస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో అభిజిత్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు ఆయన చేస్తోన్న కృషికి గానూ ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రిమర్‌లతో సంయుక్తంగా ఆయనకు నోబెల్ దక్కింది. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.     

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.