టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో వరుసగా రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాజెక్టు కొనసాగించాలని వైసీపీ సర్కారుకు హితవు పలికారు. నాడు హైదరాబాద్ అభివృద్ది చేయాలని తాము భావించినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సహకరించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడ్డుపడి ఉంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ విషయంలో విజన్ తనదే అని, ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి తన పేరే చెబుతారని తెలిపారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ తన గురించే చెప్పుకుంటారని భావించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Post a Comment