Skip to main content

మా’లో తార స్థాయికి చేరిన వివాదం.. కాసేపట్లో జరిగే సమావేశంపై ఉత్కంఠ




మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. వారిద్దరి మధ్య వివాదం ఉందన్న విషయాన్ని మా ఇప్పటికే ఖండించినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలు చేస్తుంటే విభేదాలు మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. మా సభ్యుల సమావేశం ఉందని జీవితా రాజశేఖర్‌ మెసేజ్ పంపడంతో నరేశ్‌ కార్యవర్గం విస్మయానికి గురయ్యారు. అయితే, ఈ రోజు జరిగేది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ అంటున్నారు.

అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేశ్‌ తరుఫు న్యాయవాది నిలదీస్తున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నరేశ్‌కు షోకాజ్‌ నోటీసుల ఇవ్వాలని రాజశేఖర్‌ కార్యవర్గం యోచించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇది స్నేహపూర్వక సమావేశమేనని మా ముఖ్య సలహాదారు కృష్ణంరాజు కూడా అంటున్నారు. ఈ సమవేశానికి వచ్చిన వారితో ఎలాంటి సంతకాలు పెట్టించబోమని తెలిపారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here