Skip to main content

ఇన్ఫోసిస్ లో సత్యం తరహా స్కామ్... ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన ఈక్విటీ విలువ!

 

వస్తున్న ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, లాభాలను తక్కువగా చూపుతున్నారంటూ, ఓ సంఘంగా ఏర్పడిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు బహిరంగ లేఖను రాయడం కార్పొరేట్ వర్గాల్లో, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలిల్ పరేఖ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరు ఆడిటర్లను కూడా మేనేజ్ చేశారని కొందరు ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, 2013 తరువాత ఇన్ఫీ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత 16 శాతానికి పైగా నష్టపోయిన ఈక్విటీ వాల్యూ, ప్రస్తుతం 14.13 శాతం నష్టంతో రూ. 660 వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది.

కాగా, దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సత్యం కంప్యూటర్స్ లోనూ ఇదే తరహా స్కామ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కుంభకోణం తీవ్ర కలకలం రేపగా, ఆపై జరిగిన పరిణామాలతో, సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలో విలీనమైంది.

ఇదిలావుండగా, ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో 39,358 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 27 పాయింట్ల లాభంతో 11,689 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.   

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...