పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛభారత్’కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టి మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మోదీ. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఉదయం స్థానిక బీచ్‌కు వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త కన్పించడంతో స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టారు. బీచ్‌లో చెత్తను తొలగించారు.
శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోదీ అక్కడి బీచ్‌లో స్వచ్ఛభారత్ చేపట్టారు. బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్‌ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్‌కు జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Post a Comment