హుజూర్ నగర్ కు త్వరలో జరగనున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు
ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మద్దతుపై పునరాలోచన చేయనుంది.
తెలంగాణలో ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న టీఎస్సార్టీసీ సమ్మెకు సీపీఐ
మద్దతు ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే హుజూర్ నగర్
లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచన చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర
ప్రధానకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీపై ప్రభుత్వ
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా రేపు
అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలుపుతామని
చెప్పారు.
Comments
Post a Comment