Skip to main content

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..

ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా. దీనికి బీజేపీకి చెందిన నేత కౌంటర్ ఇచ్చారు.


Upasana: రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..
ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా.
బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ..... దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుందంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఐతే.. ఉపాసన ట్వీట్ పై విభిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి రాజమౌళి, ప్రభాస్, రానాకు ఆహ్వానం అందినా.. వాళ్లు లండన్‌లో ప్రదర్శితమయ్యే బాహుబలి సినిమా కోసం అక్కడే ఉండటంతో ఈ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినట్టు సమాచారం. ఐతే ఈ వేడకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈనాడు’ సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్..ఈటీవీ సీఈవో బాపినీడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, దిల్ రాజు, రకుల్ ప్రీత్ సింగ్ సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు హాజరయ్యారయ్యారు. తెలుగు నుంచి ఇంత మంది హాజరయిన ఈ గగ్గోలు ఏమిటి అని ఉపాసన తీరును కడిగిపారుస్తున్నారు కొంత మంది నెటిజన్స్. మరోవైపు ఉపాసనను మరికొంత మంది ప్రశ్నిస్తూ.. మీ అపోలో హాస్పిటల్‌లో తెలుగు వాళ్లను  ఎంత మందిని తీసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

తాజాగా బీజేపీ కి చెందిన నేత ఒకరు.. ఉపాసనను ప్రశ్నిస్తూ.. మీ మామ చిరంజీవి, మీ ఆయన రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమాల్లో తెలుగు వాళ్లను ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఎంత మంది తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు. మొత్తం నార్త్ భామలతోనే మీ కుటుంబ సభ్యులు నటిస్తున్నారంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సదరు బీజేపీ నేత అడిగిన ప్రశ్నకు ఉపాసన ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.