Skip to main content

టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

 


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశాన్ని ఈరోజు నిర్వహించి, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకోవాలని, తిరుపతిలో 250 ఎకరాలలో ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని, గరుఢ వారధి నిర్మాణ పనుల రీడిజైన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన టీటీడీ శాశ్వత  ఉద్యోగులకు రూ.14 వేల చొప్పున, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,500 చొప్పున 'బ్రహ్మోత్సవ బహుమానం' ఇవ్వాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, మూడు నెలల్లోగా తిరుమలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని తీర్మానించినట్టు తెలియజేశారు.

 టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను అమలు చేస్తామని, ఈవో నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి  తీర్మానం చేసిందని, టీటీడీ పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.   

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...