Skip to main content

కేంద్ర హోం శాఖ కార్యాలయంలో విభజన చట్టంపై ముగిసిన భేటీ

 కేంద్ర హోం శాఖ కార్యాలయంలో విభజన చట్టంపై జరిగిన సమావేశం ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటల సమయం ఈ సమావేశం కొనసాగింది.

షెడ్యూల్ 9,10 జాబితాలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు, సింగరేణి, ఆర్టీసీ, పౌరసరఫరా సంస్థలు, కార్పొరేషన్లపై, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై హోం శాఖ కార్యదర్శి వివరణ కోరినట్టు సమాచారం.   

Comments