Skip to main content

జియోకు షాకిచ్చిన వోడాఫోన్-ఐడియా... పైసా కూడా వద్దని ప్రకటన!

తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, తాము మాత్రం ఎటువంటి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

కాల్స్ మొత్తం ఉచితమేనంటూ, కేవలం డేటాకు డబ్బు చెల్లిస్తే సరిపోతుందంటూ, రెండు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చిన జియో, భారత టెలికం రంగంలో సంచలనమైన సంగతి తెలిసిందే. జియో ఇప్పుడు ఇండియాలో టాప్-2లో ఉంది. తాజాగా ఐయూసీ చార్జీల వసూలు ప్రకటనతో సోషల్ మీడియాలో జియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, వినియోగదారుల పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న వోడాఫోన్-ఐడియా మాత్రం తమకు ఎటువంటి ఐయూసీ చార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తమ వినియోగదారులు ఇతర నెట్‌ వర్క్‌ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్ కనెక్ట్‌ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది.

ఇదిలావుండగా, ఐయూసీ చార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.