Skip to main content

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు


ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. ప్రముఖ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెండర్ నామినేషన్ల పద్ధతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి తక్షణం విచారణ జరపాలని సూచించింది.
హైకోర్టు ఆదేశాలపై పుల్లారావు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే తన ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే.. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో భాద్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని పుల్లారావు ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.