Skip to main content

వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీస్తాం.. - టీడీపీ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు..


రివర్స్ టెండరింగ్ వైవిధానాన్ని ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అర్థరహితమని జలవనరుల శాఖామంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.. రెండురోజులు పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ పెన్నానది బ్యారేజీ నిర్మాణం పనులను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో రివర్స్ టెండర్స్ విధానంలో రాష్ట్రానికి ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు.పోలవరం కుడికాలువ లో రూ 58 కోట్లు, పోలవరం మెయిన్ ప్రోజెక్టుపనుల్లో రూ 800 కోట్లు,నిన్న వెలుగొండ రివర్స్ టెండర్లలో సుమారు రూ.550 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఇంతపారదర్శకంగా రివర్స్ టెండర్లు ప్రక్రియ జరుగుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం పరిశీలిస్తే వారి ఆలోచన ఎంటన్నారు. 
రాష్ట్రానికి నిధులు ఆదా అవుతున్నా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.రివర్స్ టెండరింగ్ పై విమర్శలు దాన్ని కూడా ప్రతిపక్షాలకు తగదు అని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు.
ఏపీలో నీటిపారుదల శాఖలోనే కాకుండాఏపీ టీడ్కో...హౌస్సింగ్ సహా పనుల నిర్వహణ లోను రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయ వనరులు అన్వేషిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.. రానున్న రోజుల్లో మరికొన్ని పనులకు రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగిస్తామన్నారు.. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ వర్కుల విషయంలో తొలిసారిగా తమ ప్రభుత్వం టెండరింగ్ విధానం అమలు చేస్తున్నారన్నారు..
నెల్లూరు జిల్లాలో బ్యారేజీ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని మంత్రి అనిల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నీటిపారుదల, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.