Skip to main content

ఆర్టీసీ సమ్మె.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె 18వ రోజుకు చేరడంతో హైకోర్టు ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 సాయంత్రం వరకు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ, అధికారుల మధ్య  సమాలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశముందని సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ప్రధాన డిమాండ్ మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశముంది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.