Skip to main content

సాగరతీరాన మోదీ స్వచ్ఛభారత్‌

సాగరతీరాన మోదీ స్వచ్ఛభారత్‌




 పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛభారత్‌’కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛభారత్‌ చేపట్టి మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మోదీ. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఉదయం స్థానిక బీచ్‌కు వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త కన్పించడంతో స్వయంగా స్వచ్ఛభారత్‌ చేపట్టారు. బీచ్‌లో చెత్తను తొలగించారు. 

శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోదీ అక్కడి బీచ్‌లో స్వచ్ఛభారత్‌ చేపట్టారు. బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్‌ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్‌కు జాగింగ్‌ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అని మోదీ పేర్కొన్నారు. 

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...