Skip to main content

బాగ్దాదీపై దాడిని లైవ్ చూసిన డొనాల్డ్ ట్రంప్... దాడి చేస్తున్న వీడియోలు ఇవిగో!


ఎనిమిది అమెరికన్ యుద్ధ హెలికాప్టర్లు... వారికి తాము చేయాల్సిన పనేమిటో తెలుసు. అది ఎంత క్లిష్టమైనదో కూడా తెలుసు. శత్రువుకు ఏ మాత్రం అనుమానం రాకుండా చుట్టుముట్టాలి. దానికన్నా ముందు వారిని భయకంపితులను చేసేలా వైమానిక దాడులు జరపాలి. ఈ ఆపరేషన్ మొత్తం ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని హతమార్చేందుకే.

తమ సైన్యం బాగ్దాదీని హతమార్చేందుకు బయలుదేరిన తరువాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి లైవ్ చూశారు. కొందరు సైనికాధికారులు, సలహాదారులతో కలిసి దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ ను సమీక్షించారు. అమెరికా దళాలు చుట్టుముట్టిన తరువాత, బాగ్దాదీతో పాటు అతని భార్య, తమ వద్ద ఉన్న బాంబులను పేల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికన్ సైనికులు దాడి జరుపుతున్న దృశ్యాలతో పాటు, దాడి తరువాత బాగ్దాదీ దాగున్న బంకర్ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Comments