కుక్కలు తరుముతుండగా... ఒక కలుగు (టన్నెల్)లో చివరికి వచ్చి ఎటువెళ్లాలో తెలియక ఐసిస్ వ్యవస్థాపకుడు బాగ్దాదీ చిక్కుకుపోయాడు.. లొంగిపొమ్మని అమెరికా హెచ్చరికలు వినిపిస్తుండగా.. హఠాత్తుగా బాగ్దాదీ ఉన్న చోట భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాగ్దాదీతోపాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కైలా ముల్లెర్‌కు న్యాయం దక్కింది.. అసలు ఈ ముల్లెర్ ఎవరూ..? బాగ్దాదీ మరణంతో ఆమెకు న్యాయం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
ఆపరేషన్‌కు బీజం..
డిజిటల్ నిఘా వచ్చిన ఈ రోజుల్లో కూడా బాగ్దాదీ వేటకు అమెరికా పురాతనమైన మానవ ఇంటెలిజెన్స్ విధానాన్ని అనుసరించడం విశేషం. సెప్టెంబర్ మధ్యలో ఇరాక్‌కు చెందిన అధికారులకు ఒక వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతను బాగ్దాదీ సోదరులైన అహ్మద్, జుమాల భార్యలను ఇడ్లిబ్ ప్రాంతానికి అక్రమంగా తరలించడానికి సహాయం చేసినట్లు గుర్తించారు. అదే స్మగ్లర్ బాగ్దాదీ పిల్లలను కూడా అక్కడకు తరలించినట్లు పసిగట్టారు. బాగ్దాదీ అల్లుడు, అతని భార్య నుంచి బాగ్దాదీ ప్రయాణించే మార్గం వివరాలను ఇరాక్ అధికారులు తెలుసుకొని అమెరికా నిఘా సంస్థ సీఐఏకు ఉప్పందించారు.
అప్పటికే గాయాలు, మతిమరుపు, మధుమేహంతో బాధపడుతున్న 48 ఏళ్ల బాగ్దాదీ తరచూ తన స్థావరాలను మార్చేస్తున్నట్లు గుర్తించారు. జనవరిలో తూర్పు సిరియాలోని భగూజ్ వద్ద ఉన్నట్లు యూరప్ ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఇడ్లిబ్‌కు రావడానికి ముందు తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్ మధ్య ప్రాంతాల్లోనే ఉండేందుకు అతడు ఇష్టపడ్డాడు. టర్కీకి అత్యంత సమీపంలోని బరీష్ గ్రామంలో ఇళ్లను తరచూ మారుస్తున్నట్లు అమెరికా, ఇరాక్ బలగాలు ధ్రువీకరించుకొన్నాయి.
అదే సమయంలో అబు మహమ్మద్ అల్ హలాబీ పేరు బయటకు వచ్చింది. ఇతను ఒకప్పుడు బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడు. హుర్రాస్ అల్ దెయిన్ అనే స్థానిక మిలిటెంట్ గ్రూప్ నాయకుడు. అతను బరీష్
వద్ద సొరంగంపై నిర్మించిన ఇంటిని గత ఏడాది కొనుగోలు చేశాడు. ఇది ఎవరైనా తప్పించుకోవడానికి అత్యంత అనువుగా ఉంటుంది. హలాబీ గ్రూప్ అంతకు కొన్ని వారాల ముందే కొందరు ఐసిస్ సానుభూతిపరులను చంపింది కూడా. కానీ, బాగ్దాదీ అతని ఇంట్లోనే ఉండటం విశేషం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకొని అమెరికా నిఘా వర్గాలు గురువారం మధ్యాహ్నం అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్‌కు సమాచారం చేరవేశాయి. శనివారం ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమెరికా ప్రత్యేక బలగాలు వెంటనే ఇర్బిల్‌లోని స్థావరం నుంచి ఇడ్లిబ్ దిశగా బయల్దేరాయి. వాస్తవానికి ఇడ్లిబ్ గగనతలాన్ని రష్యా నియంత్రిస్తోంది. దీంతో రష్యా, కుర్దులు, టర్కీకు సంక్షిప్తంగా సమాచారం తెలియజేశారు. అలా ఆపరేషన్ కైలా ముల్లెర్ మొదలైంది.
కైలా ముల్లెర్ ఎవరో తెలుసా..?
అర్ధరాత్రి ఒంటిగంటకు..
వెంటనే అక్కడ దొరికిన శరీర నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్‌కు ముందే బాగ్దాదీ డీఎన్‌ఏతో సిద్ధంగా ఉన్న నిపుణుల బృందం ఆ శరీర భాగాలకు పరీక్షించి ఆవి బాగ్దాదీవేనని తేల్చాయి. దాడి ముగిసిన రెండు గంటల్లోనే బాగ్దాదీ శరీరభాగాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించడం విశేషం.
మరో బృందం అక్కడ రక్షించిన పిల్లలను సమీపంలోని ప్రాంతాలకు తరలించింది. దీంతోపాటు అటాక్ హెలికాప్టర్ల దాడిలో ధ్వంసమైన ఇళ్ల శిథిలాల నుంచి లభించిన నమూనాలను సేకరించారు. తెల్లవారుజామున 3.30కు దాడి ముగించుకొని హెలికాప్టర్ బృందాలు ఇర్బిల్‌కు తిరుగు ప్రయాణమయ్యాయి. దాదాపు 70 నిమిషాలు ప్రయాణించి గమ్యానికి చేరుకొన్నాయి. అనంతరం ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేశాయి.
ఈ ఆపరేషన్‌కు ఒక రోబో వాడేందుకు అమెరికా సిద్ధమైంది. కానీ, ఆ రోబోను ఒక మనిషి దగ్గర నుంచి నడిపించాలి. బాగ్దాదీ వద్ద అప్పటికే ఆత్మాహుతి సూట్ ఉండటంతో ఆ రోబో ఆపరేటర్ మరణించే అవకాశం ఉంది. దీంతో కుక్కలను వినియోగించారు. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఒక ధైర్యవంతమైన, ప్రతిభావంతమైన శునకం గాయపడిందని ట్రంప్ వెల్లడించారు.
అలా ‘ఆపరేషన్ కైలా ముల్లెర్’ ముగిసింది. ఇప్పటివరకు పలు ఆపరేషన్లలో తప్పించుకున్న బాగ్దాదీ ముల్లెర్ పేరుతో మొదలు పెట్టిన ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రకంగా ముల్లెర్ ప్రతీకారం తీర్చుకొన్నట్లైంది.
Comments
Post a Comment