ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇవాళ బోటు వెలికితీత పనుల సందర్భంగా కచ్చులూరు వద్ద నదిలో ఓ వ్యక్తి మొండెం లభ్యమైంది. బ్లాక్ జీన్స్ ప్యాంటు ధరించినట్టుగా ఉన్న మృతదేహాన్ని బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఒకరిదిగా భావిస్తున్నారు.
కాగా, వైజాగ్ నుంచి ధర్మాడి సత్యం తీసుకువచ్చిన స్కూబా డైవర్లు ఎట్టకేలకు నదీ గర్భంలో ప్రవేశించారు. ఆక్సిజన్ మాస్క్ లు ధరించిన స్కూబా డైవర్లు బోటు మునిగిన ప్రాంతంలో నది లోపలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వెలుపలికి వచ్చి తాము గమనించిన విషయాలను అధికారులతో పంచుకున్నారు.
ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో నేడు కూడా వెలికితీత పనులు షురూ అయ్యాయి. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగరు తగిలించి బయటికి లాగాలన్నది ధర్మాడి సత్యం బృందం ప్రణాళికగా తెలుస్తోంది.

Comments
Post a Comment