Skip to main content

దేశం విడిచి పారిపోలేదు: వీడియో విడుదల చేసిన ‘కల్కి’ వ్యవస్థాపకులు



'కల్కి' ఆశ్రమంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. వారిద్దరు తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో విజయ్ కుమార్ దంపతులు మాట్లాడుతూ.. తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

దేశం విడిచి పారిపోయామంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు చెప్పుకొచ్చారు. అలాగే, తమ ఆశ్రమాల ప్రధాన కార్యాలయాల్లో ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ దంపతులు అన్నారు. కాగా, ఇటీవల కల్కి ఆస్తులపై ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం లభ్యం కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here