Skip to main content

చంద్రబాబూ: విజయసాయి రెడ్డి ఎద్దేవా


ఎప్పుడు మీడియా సమావేశాల్లో మాట్లాడినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్... అన్న పదాలను చంద్రబాబు వాడకుండా ఉండలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మరెవరైనా చెబితే బాగుంటుందిగానీ, సమయం, సందర్భం లేకుండా తానే స్వయంగా చెప్పుకుంటూ పోతే ఎలాగని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం విజయసాయి ట్వీట్లు పెట్టారు.

"మీడియా ముందైనా, సమీక్షా సమేవేశాలైనా మూడు విషయాలు తప్పనిసరిగా చెబ్తాడని ముందే తెలిసి పోతుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్. ఇవి లేకుండా మాట్లాడలేడు. ఇంకెవరైనా చెబితే బాగుంటుంది కానీ సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా చంద్రబాబు గారూ?" అని ప్రశ్నించారు.

అంతకుముందు, "అవునా కాదా తమ్ముళ్లూ? అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నాడు. తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నాడు. పోలవరం, అమరావతి, పిపిఏ ల గురించి అవే పాచి మాటలు. మాటల్లో ఎందుకో వణుకు కనిపిస్తోంది" అని కూడా వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.