Skip to main content

యూఎస్ లో దుమ్మురేపేస్తోన్న 'సైరా'

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సైరా నరసింహా రెడ్డి' ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమా 1 మిలియన్ వసూళ్లను రాబట్టేసింది.

అక్కడ కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో వారాంతపు సెలవుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. బలమైన కథాకథనాలు .. భారీ బడ్జెట్ .. వివిధ భాషల్లో క్రేజ్ వున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ కి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Comments