Skip to main content

సమంత, మంచు లక్ష్మిలపై యాంకర్ శ్వేతా రెడ్డి షాకింగ్ కామెంట్స్!


 



తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే టీవీ యాంకర్ శ్వేతా రెడ్డి, ఉమెన్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల షీ టీమ్స్ ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమంత అక్కినేని, మంచు లక్ష్మి, పీవీ సింధులు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన శ్వేతారెడ్డి, వీరు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారేనని వ్యాఖ్యానించారు.

సమంత రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని, కేటీఆర్ నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయని ఆరోపించారు. మంచు లక్ష్మి ఫ్యాషన్ షోలు, సినిమాలు తదితరాలకు ప్రభుత్వం నుంచి కొద్దో గొప్పో ప్రయోజనాలను పొందారని, పీవీ సింధు ప్రభుత్వం నుంచి ఎకరాలకు ఎకరాల భూమిని తీసుకుందని ఆరోపించారు.

ఈ ముగ్గురు మహిళామణులు ఇక బంగారు తెలంగాణలో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఫీల్ కాకుండా ఏడ్చే పరిస్థితి ఎక్కడుందని అడిగారు. వీరు ముగ్గురూ తప్ప రాజకీయ నాయకులుగానీ, జర్నలిస్టులు గానీ, పోలీసుల్లోని మహిళలుగానీ షీ టీమ్స్ గురించి స్పందించలేదని శ్వేతా రెడ్డి అన్నారు.

బిగ్ బాస్ షో గురించి తనతో సహా ఎంతో మంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించిన శ్వేతా రెడ్డి, అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూ, పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా షీ డీసీపీలు, షీ సిట్ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

పబ్బులు, క్లబ్బులు తిరుగుతూ, శని, ఆదివారాలు తప్పతాగి, రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ సమంత, మంచు లక్ష్మి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయినా, కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ షీ టీమ్స్ సమంత, లక్ష్మి, పీవీ సింధులకు మాత్రమే రక్షణగా ఉన్నారని, అత్యాచారాలను, మహిళలపై వేధింపులను పట్టించుకోవడం లేదని అన్నారు. శ్వేతా రెడ్డి వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...