Skip to main content

బిగ్ బాస్ లీక్... నేడు వితిక ఎలిమినేట్!


 



ప్రతి వారమూ లీకులు వస్తున్నట్టుగానే టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 13వ వారం ఎలిమినేట్ ఎవరవుతారన్న విషయంపైనా లీకులు బయటకు వచ్చాయి. ఈ వారంలో వితికా షేరు బయటకు వెళుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. సీజన్-3 ఇప్పటికే తుది దశకు చేరుకోగా, హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారంలో వీరంతా నామినేషన్ లోనే ఉండగా, రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లు సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. వారికి బాగానే ఓట్లు వచ్చాయి.

ఇక ఇప్పటివరకూ నమోదైన పోల్స్ ట్రెండ్స్ చూస్తే, వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రేక్షకులకు చికాకు తెప్పించేలా వితిక వ్యవహరించిందని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో వితిక హౌస్ లో ఉండటంతో వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకున్నాడన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక నేడు వితిక ఎలిమినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తాడా? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, రాత్రి వరకూ వేచి చూడాల్సిందే.

Comments