పాదయాత్రలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్డన్ రెడ్డి అన్నారు.. మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియని కుటుంబం వైఎస్సార్ కుటుంబమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
.జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గములో చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారన్నారు.నవరత్నాలలో ఒక పధకం వై.యస్.ఆర్. రైతుభరోసాని మా జిల్లాలో ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.ప్రధానంగా జిల్లాలో అన్ని జలాశయాలు జలకళతో ఉన్నాయనన్నారు.తిరిగి మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రారంభం అయింది అనడానికి జలాశయాలలో జలకళే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరే బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరని ఆయన విమర్శించారు.ఇక తెలుగుదేశం పార్టీని ఏ వర్గం వాళ్ళు నమ్మరని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రుణమాఫీ అని చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారాని గుర్తు చేశారు.రైతులు సంతోషంగా ఉండటం
చంద్రబాబుకు ఇష్టం లేదని. అందుకే ఆయన కావాలనే వైయస్సార్సీపీ పై నిందలువేస్తున్నాడన్నారు..చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు జిల్లాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నాడన్నారు.
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా. ఆయన్నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వెల్లడించారు.రానున్న రోజులలో తెలుగుదేశంకు టికెట్ అడిగే వారు కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు.
Comments
Post a Comment