Skip to main content

అమిత్ షా జీ... మీకు ఇలాంటి చిరస్మరణీయమైన రోజులు మరెన్నో రావాలి: చంద్రబాబు



కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.  "హ్యాపీ బర్త్ డే అమిత్ షా జీ... ఈ పుట్టినరోజు మీకు చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది మీకు అంతా మంచే జరగాలని, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.