ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ ప్రభుత్వం కోట్ల మేర డబ్బులను ఆదా చేసింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో దాదాపు రూ.87 కోట్ల మేర జగన్ ప్రభుత్వం ఆదా చేసినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను గతంలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో రెండో టన్నల్ పనుల టెండర్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు గుర్తించారు.
దీంతో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి.. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.87 కోట్లు ఆదా అయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారుకు రూ. 782.8 కోట్ల లభ్ది చేకూరిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment