Skip to main content

ఆర్టీసీ కార్మికుల కోసం రోడ్లపైకి రావడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారు: జనసేన




తమ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో... ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. తెలంగాణ బంద్ కు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు, హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

 ఈ సమావేశంలో జనసేన నేత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పూర్తి మద్దతు తెలుపుతోందని తెలిపారు. జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ సహకారం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల తరపున ఉద్యమించడానికి, రోడ్ల మీదకు రావడానికి తమ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇదే సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, తమ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతివ్వాలని కోరా

Comments