Skip to main content

టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరు: కేశినేని నాని

 


తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యవహారంపై టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరని, అలాగే ఆయనను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆయన తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదని సూచించారు.

వంశీతో మాట్లాడడానినికి తాను ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలను దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. వంశీది టీడీపీ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. కాగా, వంశీతో మాట్లాడాలంటూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.   

Comments