ఆర్టీసి ఆస్తులను అమ్ముకునేందుకే ఆ సంస్థకు చెందిన కార్మికులను కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డుమీదకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. వామపక్షాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా నాంపల్లి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికుడికీ ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు, మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందకపోతే వారి కుటుంబం ఎలా బతుకుంతుందని ప్రశ్నించారు. తాను ఒక్కడే బాగుండాలని, మిగతా వారందరూ ఇబ్బందులు పడాలని కేసీఆర్ భావిస్తున్నారా? అని నిలదీశారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు.
Comments
Post a Comment